20, ఆగస్టు 2011, శనివారం

జై తెలంగాణ
నిజాం నవాబు పాలనలొ
రాజకర్ల రాచరికంలొ
నలిగి పొయినం
దేశమంత సాసంత్రం వచ్చిన
దాస్యంలొ దగ పడ్డం
దొరల పెత్తనంలొ
దొపిడి అయినం
ఏక్కడొ మొదలయిన నక్సలిజం
మావద్ద తిష్టవెసి, మాకు మచ్చగానె మిగిలింది
ప్రభుత్వలకు సాకుగ మారింది

అమాయకులమయిన మెము
అందరిని అదరించినం
ఎవరు వచ్చిన అక్కున చెర్చుకున్నాం
అభివృద్ది పెరిట మా భూములు కబ్జా చెస్తె
కొలువులస్తయనుకున్నాం
కాని మేము కూలిలవుతమను కోలె
మా చరిత్రను విస్మరించి
మా భాషను వక్రించి
మా సంస్కౄతి నశిస్తుంటె ఊరుకోవల?
మా నాగరికతను ప్రశ్నిస్తు
అవమానిస్తుంటె ఆపుకోవల?

జీవనదులు ప్రవహించె మా ప్రాంతంలొ
రైతు అన్నవాడు లేకుండా
దూబాయి లొ, ముంబాయి లొ
కూలికై వలస పోతున్నాడు
ఎదుగు బొదుగు లేని  జీవితంతొ
అలసి పోతున్నాడు

కష్టపడి చదివిన కోలువులుండవు
గవర్నమెంటు రూల్సు మీకు వర్తించవు
రాజ్యంగం హక్కు అంటు
మా హక్కులు హరిస్తారు
మా కోలువులు కొనెస్తారు
మా అకలి కేకలు వినిపించవు
మా చాలిచాలని బ్రతుకులు
మీకు అగుపించవు
ఓపిక నశించి బరించలెక
కడుపుమండి ఉద్యమిస్తె
మీకెందుకంత భయం

మా పెత్తనం మాకు కావాలి
మా ప్రాంతం మాదిగానె ఉండాలి
అంటె ఏందుకంత ఉలికిపాటు
ఏంతమంది ఉద్యమంలొ చచ్చిన
ఏంతమంది కదిలి వచ్చిన
పట్టింపులెని ప్రభుత్వనికి గుణపాఠంల
ఏళ్ళతరబడి అణచుకున్న ఆవెశం ఉపెనల మారి
విగ్రహలు కూల్చితె
అరాచకం, ఉన్మాదం అంటు పేర్లుపెట్టి
మా ఉద్యమాని తప్పుపడుతరా?

ఏళ్ళతరబడిగ ఏంతమంది
చెనెత కార్మికులు చచ్చరొ మీకు తెలుసా?
ఏంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారొ
ఏంతమంది పరయి దేశలో కుక్క చావు చచ్చరొ
మీకు పట్టిందా?
విగ్రహల కాళ్ళు చెతులు విరిగితె అంత ఆవెశమా?

బ్రతికి ఉన్నామెము ప్లోరైడ్ భాదతొ
అవయవాలు  చచ్చుబడి విగ్రహలయ్యము
తెలుగు తల్లికి అవమానం అంటు ఆక్రొశించారు
సొదరులయిన మా బ్రతుకు విస్మరించారు
మీ పాలకులను అడగండి అంటు
తప్పించుకోలెరు
స్వార్థ రాజకీయలకు మా బ్రతుకులు
ముడిపెట్టలెరు

ఈపొరాటం ఇప్పటిది కాదు
ఏ నాయకుడు కాదన్న
ఏ పార్టి తెలంగాణ రాదన్న
మా ఆవెశం చల్లరెది కాదు
ఈ ఉద్యమం అగెది కాదు

ఇప్పటికయిన వినండి
మా భూమి మాకు కావాలె
మా పెత్తనం మాకు రావాలె
మా భాష మా సంస్కౄతి
ఏప్పటికి బతకాలె
కాదంటె కోమరం భీము మళ్ళి పుడుతాడు
ఫ్రతి ఇంట్లొ
నిజాం ను ప్రారదొలిన తెగువ మళ్ళి వస్తది
ప్రతి మనసులొ
ఖభడ్దార్ ! జై తెలంగాణ ! జై జై తెలంగాణ