30, ఏప్రిల్ 2009, గురువారం

సామాన్యుని చావూ

ప్రకృతి కాటేసిన కర్షకుడు
పనికోసం పట్నం వచ్చి
పస్తులుండటం
విస్తుపోయే విషయం కాదు

చిరిగిన బట్టలు
చెదిరిన కేశాలు
కన్నీటి ముత్యాలు
అ ఇల్లాలి అలంకారాలు

చావుతో పోరాటం
బ్రతుకై ఆరాటం
అతను పిల్లలకు నేర్పే పాఠం
చాలి చాలని కూలి
తనపై తనకే జాలి

రేపటి పౌరులు
నేటి కార్మికులవుతారు
బిడ్డ ఆకలి తీర్చ తల్లులు
వొళ్ళము కుంటారు
చిరిగిన నోటు చూసి
ఘోళ్ళుమంటారు

రెండు మేతుకులకై
కుక్కలతో పోట్లాట
చెత్త కుప్పలో మొదలు వెతుకులాట
నీటిని కూడా నోచుకోని
అ పేద కడుపులు
కన్నిటినే అరగిస్తాయి
అవి యింకి పోయిననాడు
చావుకు స్వాగతమంటాయి
అతి సామాన్యంగా
మృత్యువును హత్తుకుంటాయి

3 వ్యాఖ్యలు:

  1. pedarikampy mee spandana baagundi. kaani daanini vaari karmagaa bhaavinchaka daani mulaalanu anveshinchandi. naa blog sahavaasi-v.blogspot.com chudagalaru.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. వర్మ గారు చాల సంతోషం మీ సూచనా బాగుంది కాని నేను ప్రకృతి కాటేసిన అని ముందే చెప్పాను అదే మూలం. మీ బ్లాగు కుడా చాల బాగుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  3. munduga me kavithalu chala bagunai...memealni abinanadisthunanu...jeevitha anu kavitha maaku chaala baga nachayi...veeluinantha varaku chinna kavithalu vraasi mamalni anandhaparchandi... we r the frnds of aakash

    ప్రత్యుత్తరంతొలగించు