30, ఏప్రిల్ 2009, గురువారం

సామాన్యుని చావూ

ప్రకృతి కాటేసిన కర్షకుడు
పనికోసం పట్నం వచ్చి
పస్తులుండటం
విస్తుపోయే విషయం కాదు

చిరిగిన బట్టలు
చెదిరిన కేశాలు
కన్నీటి ముత్యాలు
అ ఇల్లాలి అలంకారాలు

చావుతో పోరాటం
బ్రతుకై ఆరాటం
అతను పిల్లలకు నేర్పే పాఠం
చాలి చాలని కూలి
తనపై తనకే జాలి

రేపటి పౌరులు
నేటి కార్మికులవుతారు
బిడ్డ ఆకలి తీర్చ తల్లులు
వొళ్ళము కుంటారు
చిరిగిన నోటు చూసి
ఘోళ్ళుమంటారు

రెండు మేతుకులకై
కుక్కలతో పోట్లాట
చెత్త కుప్పలో మొదలు వెతుకులాట
నీటిని కూడా నోచుకోని
అ పేద కడుపులు
కన్నిటినే అరగిస్తాయి
అవి యింకి పోయిననాడు
చావుకు స్వాగతమంటాయి
అతి సామాన్యంగా
మృత్యువును హత్తుకుంటాయి

జీవితం !!

జీవితమంటే ఓ రోజులో సగం రోజు
పుట్టుక సుర్యోదయమంత అందమయినది
బాల్యం ఉదయమంత ఆహ్లాదకరమయింది
యవ్వనం ప్రాతః కాలమంత ఉషారయింది
నడివయస్సు మద్యహ్నమంతా కరుకయింది
వృద్ధాప్యం సాయంత్రమంత ప్రశాంతమయింది
మరణం సుర్యస్తామయమంతా అందకారమయింది
యింతటిదే జీవితం-ఓ రోజులో సగం


మాతృభూమి

ఓ పవిత్రమయిన నే పుట్టిన నేల
ప్రపంచాని సంవత్సరాలుగా చదువుతున్నాను
కొలువు పై ఆశను నిలువునా కాల్చేసాను
నిన్ను చిలుస్తూ నా తండ్రి
నాపై ఆశాలు పెంచాడు
తన వాళ్ళ కాదంటూ ముసుగు తన్నేశాడు

నిన్ను తిరిగి నా చెప్పులు కరిగి పోయాయి
నా కాళ్ళు అరిగి పోయాయి
ఫలితం నీలాగె ఉంది
స్వయం ఉపాదికి సత్తువేది?
అప్పు ఇస్తామన్న బ్యాంకు ఆచుకేది?
గంపెడు అక్షరాలున్న
నీపై అసహ్యమేస్తుంది
నాపై నాకే జాలేస్తుంది
నిన్నపహస్యం చేస్తూ మనసు తృప్తి పడుతుంది

నీపై శవాలు నాటి
చావుల వ్యవసాయం చేయాలనుంది
నా సోదరుల ఉసురు తగిలే
నివు స్మశానంలా మరుతున్నావు
ఏముంది నీలో గొప్ప?
గొప్పదయినా ఆకలి తప్ప!
శాంతికి చిహ్నం నీవా?
నెత్తురు రుచే ఎరుగవా?
ప్రజాస్వామ్యం నీ  పాలికా?
అదిగో నీ  ప్రజల చావూ కేక !
ఓ నేల నీకు ఆత్మసాక్షి లేదా?
నీకు అంతరాత్మ లేదా?

యికనయిన మానుకో కాలం చెల్లిన ని గొప్పలు
నీకు మాయలు కూడా తెలుసా?
లేక నేనంటే నా మనసుకు అలుసా?
తీరదు దానికి నీపై మేహం
చూపదు నీపై నా ద్వేషం

అమ్మ తెచ్చిన మట్టికుడులో
యిసుక రాయి సంగింతం చిలికింది
నా నుండి "అమ్మ" కమ్మని రాగం పలికింది
నీళ్ళ చెంబుతో అమ్మ పరుగులు
తొలగి పోతున్న అజ్ఞానం తెరలు
పరాయి నేల కనేది మనుషులే
వారి ప్రవర్తన మాత్రం పక్షులే

నిందించిన నాలుకను నికర్పించాలనుంది
మరిగిన నెత్తురు తో నిన్ను కడగాలనుంది
ప్రంపచానికి నీ గొప్ప చెప్పాలని
నన్ను నేను క్షమిస్తున్నాను
నిన్ను చిలుస్తూ బ్రతుకుతాను
నా మార్పును నే బ్రతికిస్తాను
నీపై ఒట్టు, నే పుట్టిన నా నేల