15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

కుక్క చావూల రైతు

సుక్క పొద్దున్న లేసి అలుపెరుగని యంత్రం లాగ
నాగలి పట్టి భూమిని దున్ని
పగలు తింటే రాత్రికి లేక
రాత్రి తింటే పొద్దున్న లేక
కడుపు కట్టుకుని
రాత్రి పగలు తెలియక చెమట కార్చి
పండించిన పంట బాగానే ఉంది
అప్పులు దిరుతాయని ఆశ రింపింది
గొప్ప ధరలోస్తాయని పట్నం దేస్తే
దాళరోలు కల్సి దండి కొట్టిండ్రు
అందరోక్కటయి ఒక్కన్ని  చేసి పంట నోక్కిండ్రు
యింతకంటే ఎక్కువ రాదని
బస్సు చార్జి చేతుల పెట్టిండ్రు
ధర లే లేంది ఎక్కు వేట్లియాలని సగానంపిండ్రు
యింటికొచ్చి చూస్తే వడ్డీ కట్టమని
అప్పిచ్చిన సేటు పట్టు పట్టిండు
వడ్డీ కట్టంగా మిగిలింది వంద నోటు
పురుగుల మందులకు యాభై లోటు
యింట్ల గాసం నిండింది
గంజి కాచే కుండ ఎండిది
ఆకలి బతుకును మండిత ఉంటే
బతకాలన్న ఆశ బూడిదయి పోయింది
చావూ మిద దాహ మేసి
తాగిన పురుగుల మందు
పురుగులను చంపకున్న
నన్ను చంపుతూ గొప్ప సాయం చేస్తంది
మళ్ళి బతుకు ఉంటే పురుగునయి పుడుత గాని
రైతు నయి చచ్చిన పుట్ట
యిట్ట కుక్క చావూ చావా

7 వ్యాఖ్యలు:

 1. Mama nelo intha talent undi ani eppudu chapaladu y very very nice mama. all he best

  ప్రత్యుత్తరంతొలగించు
 2. saya చావూ మిద దాహ మేసి Kotha ga Aalochimpa jesediga undi ra really. Keep writing raa

  Pavan.palli

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Very nice poem....nice language....keep it up....very very nice expression..."మళ్ళి బతుకు ఉంటే పురుగునయి పుడుత గాని "

  Wishes,
  www.polimetla.com

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పోలిమెట్ల గారు మీకు చాల చాల ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు