6, మే 2009, బుధవారం

నిజాయితీ నీవెక్కడ ?

కూలి పనికి వెళ్లి అయ్యా
కూడబెట్టిన డబ్బు
కొట్టు కెళ్ళినప్పుడు మిగిలితే
పాత చీరలో అమ్మ దాచిన చిల్లర
ఉడ్చుకెళ్ళి ఉద్యోగానికై
దరఖాస్తు పెట్టాను
నా వారి కడుపు కొట్టాను

పగలంతా మట్టిపురుగాయి
రాత్రంతా గుడ్డిదిపం వద్ద
వెలుతురు పురుగాయి
పుస్తకాలు తోలిచేశాను
నా నిద్రను, అలసటను
అమ్మ నాన్నల అశాలకై బలి చేశాను

పరిక్ష సమయం వచ్చేసింది
పట్నం వెళ్లి కొడుకు
పరీక్షా రాయాలని
అప్పు కావాలని నాన్న తిప్పలు
చివరికి చెల్లి కాలి పట్టాలు
నా ప్రయాణానికి కరిగి పోయాయి
ఆవేళ నా చెల్లి కన్నీరు
ప్రవాహమై నన్ను ముంచేసిన బాగుండు

నా తల్లి పూజలు పాలించాయి
నా కష్టానికి చివరికి ఫలితం దక్కింది
నాకు మొదటి స్థానం వచ్చింది
ఆవేళ నా తల్లి అనందం ముందు
ఎ సముద్రం పనికి రాదేమో
నా తండ్రి గర్వం ముందు
ఎవరెస్టు ఎత్తు కాదేమో
నా చెల్లి ఉషారు ముందు
ఎ ప్రవాహం కోరగాదేమో

ఇంటర్వులో అన్నింటికీ
సమాదానం చెప్పాను
తెలివయిన వాణ్ని అని
పొగడ్తలు పొందాను, కాని
బల్లకు మొలిచిన చేతులు
నా కొచ్చే కొలువును వేలం వేశాయి
డబ్బున్న పశువులు గాలం వేశాయి
నన్ను మెడపట్టి బయటకు తోశాయి

నా తండ్రి కష్టానికి ఫలితం ఎక్కడ?
నా తల్లి అశాలకు ప్రాణం ఎక్కడ?
నా చెల్లి త్యాగానికి అర్థం ఎక్కడ?
నా చదువుకు సార్థకత ఎక్కడ?
ఓ నిజాయితీ నివెక్కడ?

4, మే 2009, సోమవారం

యాచకుడు
ఉదయమవ్వటంతో మొదలు
చితికిన బ్రతుకు వ్యధలు
మోటారు మోతలతో మొదలు
నిన్న అసంపూర్తిగా తీరిన ఆకలి అరుపులు

గుడిలోని సుప్రబాతం
అతనికి స్వాగత గీతం
గుడి మెట్ల పై
మఠం వేసుకుని
యోగిలా కూర్చుంటాడు
చిల్లర యివ్వగానే
చల్లగా ఉండని దీవిస్తాడు
ధర్మం తల్లి అతని మంత్రం
బువ్వ పొందేందుకదే అతని సూత్రం

చిల్లుల చిప్పలో భక్తులు వేసే
కొబ్బరి చిప్పలే అతనికి నైవేద్యం
అప్పుడేనేమో దేవునితో సారూప్యం
రెండయిన చెప్పులు
కష్ట సుఖాలకు చిహ్నాలు
అతని మురికి చొక్కా
మనసులో కుళ్ళుకు రూపం
అసార అయిన వెదురుకర్ర
మనిషిని నిలబెట్టే విజ్ఞానపు స్థూపం

చిరిగి పోయిన జోలె లో
ఎన్ని వేసిన నిలుపు కొదు
ఎంతకూ నిండు కొదు
తృప్తి లేని మనసుకు
అది ఆకృతి కాదా ?
తరచి చుస్తే జీవితమంతా
అతని వద్దే ఉంది
నిజంగా చదివితే
వేదమంతా అతనిలో ఉంది

పావలా పైసలకై
దినమంతా సంచరిస్తాడు
యిసడింపులే
యిందనంగా సాగిపోతాడు
ఆకలి శక్తిని అరగిస్తున్నా
వెచ్చని కన్నిటిలో
మనసు ఉడికి పోతున్నా
గొంతులో అర్థతను అంతం చెయ్యడు
నిజమయిన నటుడు

అశాల సాగర తీరంలో
జీవితాన్ని రేపటి ఇసుకతో
గుళ్ళుగా కట్టుకునే
పసివాడతాను
దురదృష్టం సూర్యరశ్మికి
రేపటి యిసుక పొడిగా మారి
జీవితపు గూడు కులితే మాత్రం
పసివాడిలా మారాం చేయడు
కట్టడాలు తిరిగి మొదలెడుతాడు
అర్థం చేసుకుని అనుసరిస్తే
అతనొక ఆదర్శం

సగం ఖాళి ఉన్న పేగులు
గోల పెడుతున్నా
అలసి పోయిన ఒళ్ళు
పాడే జోలకు లొంగిపోతాడు
చెట్టు ఒడిలో ఓడిగిపోతాడు
రాత్రి వడి వడిగా కదుల్తుంది
చంద్రుడు త్వర త్వరగా పరుగేడుతాడు
తొందరగా తెల్లవారాలని
రేపయినా అతని ఆకలిపూర్తిగా తిరుతుందేమోనని

30, ఏప్రిల్ 2009, గురువారం

సామాన్యుని చావూ

ప్రకృతి కాటేసిన కర్షకుడు
పనికోసం పట్నం వచ్చి
పస్తులుండటం
విస్తుపోయే విషయం కాదు

చిరిగిన బట్టలు
చెదిరిన కేశాలు
కన్నీటి ముత్యాలు
అ ఇల్లాలి అలంకారాలు

చావుతో పోరాటం
బ్రతుకై ఆరాటం
అతను పిల్లలకు నేర్పే పాఠం
చాలి చాలని కూలి
తనపై తనకే జాలి

రేపటి పౌరులు
నేటి కార్మికులవుతారు
బిడ్డ ఆకలి తీర్చ తల్లులు
వొళ్ళము కుంటారు
చిరిగిన నోటు చూసి
ఘోళ్ళుమంటారు

రెండు మేతుకులకై
కుక్కలతో పోట్లాట
చెత్త కుప్పలో మొదలు వెతుకులాట
నీటిని కూడా నోచుకోని
అ పేద కడుపులు
కన్నిటినే అరగిస్తాయి
అవి యింకి పోయిననాడు
చావుకు స్వాగతమంటాయి
అతి సామాన్యంగా
మృత్యువును హత్తుకుంటాయి

జీవితం !!

జీవితమంటే ఓ రోజులో సగం రోజు
పుట్టుక సుర్యోదయమంత అందమయినది
బాల్యం ఉదయమంత ఆహ్లాదకరమయింది
యవ్వనం ప్రాతః కాలమంత ఉషారయింది
నడివయస్సు మద్యహ్నమంతా కరుకయింది
వృద్ధాప్యం సాయంత్రమంత ప్రశాంతమయింది
మరణం సుర్యస్తామయమంతా అందకారమయింది
యింతటిదే జీవితం-ఓ రోజులో సగం


మాతృభూమి

ఓ పవిత్రమయిన నే పుట్టిన నేల
ప్రపంచాని సంవత్సరాలుగా చదువుతున్నాను
కొలువు పై ఆశను నిలువునా కాల్చేసాను
నిన్ను చిలుస్తూ నా తండ్రి
నాపై ఆశాలు పెంచాడు
తన వాళ్ళ కాదంటూ ముసుగు తన్నేశాడు

నిన్ను తిరిగి నా చెప్పులు కరిగి పోయాయి
నా కాళ్ళు అరిగి పోయాయి
ఫలితం నీలాగె ఉంది
స్వయం ఉపాదికి సత్తువేది?
అప్పు ఇస్తామన్న బ్యాంకు ఆచుకేది?
గంపెడు అక్షరాలున్న
నీపై అసహ్యమేస్తుంది
నాపై నాకే జాలేస్తుంది
నిన్నపహస్యం చేస్తూ మనసు తృప్తి పడుతుంది

నీపై శవాలు నాటి
చావుల వ్యవసాయం చేయాలనుంది
నా సోదరుల ఉసురు తగిలే
నివు స్మశానంలా మరుతున్నావు
ఏముంది నీలో గొప్ప?
గొప్పదయినా ఆకలి తప్ప!
శాంతికి చిహ్నం నీవా?
నెత్తురు రుచే ఎరుగవా?
ప్రజాస్వామ్యం నీ  పాలికా?
అదిగో నీ  ప్రజల చావూ కేక !
ఓ నేల నీకు ఆత్మసాక్షి లేదా?
నీకు అంతరాత్మ లేదా?

యికనయిన మానుకో కాలం చెల్లిన ని గొప్పలు
నీకు మాయలు కూడా తెలుసా?
లేక నేనంటే నా మనసుకు అలుసా?
తీరదు దానికి నీపై మేహం
చూపదు నీపై నా ద్వేషం

అమ్మ తెచ్చిన మట్టికుడులో
యిసుక రాయి సంగింతం చిలికింది
నా నుండి "అమ్మ" కమ్మని రాగం పలికింది
నీళ్ళ చెంబుతో అమ్మ పరుగులు
తొలగి పోతున్న అజ్ఞానం తెరలు
పరాయి నేల కనేది మనుషులే
వారి ప్రవర్తన మాత్రం పక్షులే

నిందించిన నాలుకను నికర్పించాలనుంది
మరిగిన నెత్తురు తో నిన్ను కడగాలనుంది
ప్రంపచానికి నీ గొప్ప చెప్పాలని
నన్ను నేను క్షమిస్తున్నాను
నిన్ను చిలుస్తూ బ్రతుకుతాను
నా మార్పును నే బ్రతికిస్తాను
నీపై ఒట్టు, నే పుట్టిన నా నేల

13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

క్షణమయిన చాలు

దినమంతా నిన్ను గూర్చి ఆలోచిస్తూ
ప్రతిక్షణం నిన్నే తలుస్తూ
గడిపేస్తున్నాను
నా మనసులో నిలుపుకున్న నీ  రూపంతో
ఉసులాడుతున్నాను
ని ప్రేమే ఉపిరిగా బ్రతుకుతున్నాను
విరిసిన పూవులలో నీ  నవ్వును
కురిసే మంచులో నీ  మనసును
నా హృదయ నేత్రంతొ  దర్శిస్తున్నాను
వీచే గాలిలో ని ఉపిరి కావాలని
నివు నడిచే దారిలో మట్టినయిన కావాలని
పరి తపిస్తున్నాను
నీటి బిందువయిన కాకపోతిని
నీలో కలిసి పోవటానికి
మల్లె తిగనయిన కాకపోతిని
నా ప్రేమను పుళ్ళుగా నికివ్వటానికి
నీడలా నిన్ను వెంటడుతున్నాను
నీ మనసులో నిలవటానికి
నీ  ప్రేమ క్షణమయినా చాలు
నీ  ఆత్మీయత అర నిమిషం చాలు
యీ జీవితమంతా క్షణక్షణం
అ మదుర క్షణం తలుస్తూ గడిపేస్తాను
ఆ అరనిమిశాన్నే ఆనందంగా మలచుకుంటాను

క్షణం !నిన్ను చూసిన క్షణం-నా ఉపిరి ఆగింది
నీతో మాటాడిన క్షణం-నా గుండె వేగం పెరిగింది
నీతో కలిసి నడిచిన క్షణం-నా ఎద గాలిలో తేలియాడింది
నీతో గడిపిన ప్రతి క్షణం-నా మనసు అనందం లో మునిగింది
నిన్ను తాకిన క్షణం-నా తనువు తనను తానె మరిచింది
నిన్ను కలలో చుసిన క్షణం-నా కనులు తరించాయి
ని ప్రేమలో ప్రతి క్షణం బ్రతకాలనుకున్న నా హృదయం
నివు కాదన క్షణం కుప్ప కూలింది!
క్షణం లో నా బ్రతుకు నెల వాలింది